Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

పోతుల నాగేపల్లి విఆర్ఏ మృతి

మట్టి ఖర్చులకు గాను 25 వేల రూపాయలు సహాయం

విశాలాంధ్ర ధర్మవరం:: మండలంలోని పోతుల నాగేపల్లి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేస్తూ ఈనెల 26వ తేదీ శుక్రవారం ఓబన్న అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న తాసిల్దార్ రమేష్ ఆదేశాల మేరకు డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ భాస్కర్, తోటి గ్రామ రెవెన్యూ సహాయకులు వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతిని తెలిపి, మట్టి ఖర్చులకు గాను 25 వేల రూపాయల నగదును ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ మృతి చెందిన ఓబన్న తన విధులను సక్రమంగా నిర్వర్తించడం జరిగిందని, గ్రామ ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img