విశాలాంధ్ర ధర్మవరం;;గత 50 సంవత్సరాలనుండి సుయోధన రారాజు పాత్ర లో రానిస్తున్న ధర్మవరం నాటక కళాకారులు, లయన్ పల్లెం వేణుగోపాల్ ఒకరు ఆయన కు దుర్యోధన పాత్ర అంటే చాలా ఇష్టం. తనకు అలనాటి నందమూరి తారక రామారావు అంటే చాలా ఇష్టం అన్నారు. ఆయన స్ఫూర్తి తో శ్రీ కృష్ణ పాండవీయం, దాన వీర సూర కర్ణ పాత్రలు ఆదర్శం అని అన్నారు. చేనేత రంగం లో వుంటూ సేవాభావం తో లయన్ చార్టెడ్ మెంబర్ గా లయన్స్ క్లబ్ లో సేవలు అందిస్తూ వున్నారు. వీరిని ధర్మవరం గూడూరు నాగయ్య కంటి ఆసుపత్రి ఎమ్. డి. లయన్ గూడూరు మోహన్ దాస్ అభినందించారు. సుయోధన పాత్ర లో ఆయనకు ఆయనే సాటి అన్నారు.ఈ విషయం పై చేనేత నాయకులు గిర్రాజు నగేష్, పల్లెం కృష్ణ, పల్లెం వేణుగోపాల్ రారాజు పాత్ర లో చాలా బాగా నటిస్తారని వారికి ప్రత్యేక ప్రశంసలు అందించారు.