Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

సత్య కుమార్ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న డోలా రాజారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: సేవా తత్పరుడు, అనునిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ 28 వ వార్డు ప్రజల కష్టాలలో అండగా నిలుస్తూ ఆర్థిక సాయం అందజేసే సేవా తత్పరుడు 28వ వార్డు వైసిపి ఇన్చార్జ్ డోలా రాజారెడ్డి గురువారం ఎన్డీఏ ధర్మవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక పాండురంగ స్వామి సర్కిల్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో 28వ వార్డు వైసిపి ఇన్చార్జి డోలా రాజారెడ్డి, వైసీపీ నాయకురాలు కంచం లీలావతి, బీసీ సంఘం ఐక్యవేదిక నాయకులు శ్రీరాములు తదితరులు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా సత్య కుమార్ డోలా రాజారెడ్డి తదితరులకు బిజెపి కండవాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డోలా రాజారెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోవు ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి సత్య కుమార్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. పార్టీ అభివృద్ధి కొరకు తాను అనునిత్యం పోరాటానికి సల్పుతానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img