విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా తలంపుతో నాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆశీస్సులతోమాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని తాడిమర్రి నుండి చిల్లవారిపల్లి కోటేశ్వర స్వామి ఆలయం వరకు రెండవ రోజు పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ పాదయాత్రలో కౌన్సిలర్ గజ్జల శివ తోపాటు నాయకులు తొండమాల రవి, కృష్ణమూర్తి, చెలిమి పెద్దన్న, చందమూరి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాల్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ పార్టీ చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారు. తదుపరి చందమూరి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వము చేయని ప్రభుత్వ సంక్షేమ పథకాలను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనతో, కృషితో, అహర్నిశలు రాష్ట్ర ప్రజలకు జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు బురద చల్లడం సరియైన పద్ధతి కాదని ఇతవు పలికారు. తన నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి, కుల మతాల కు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నవరత్నాల పథకాన్ని అర్హులైన వారందరికీ కూడా అందించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో వేలాదిమందికి ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని, డ్వాక్రా మహిళలకు లోన్లు, ఉపాధి హామీ పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వార్డు ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.