Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఉచిత వేసవి చదరంగం, టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరం…

నిర్వహణ కళా జ్యోతి పాలకవర్గం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతి లో ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు(35 రోజులు) కళా జ్యోతి పాలకవర్గం వారిచే ఉచిత వేసవి చదరంగం, టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరము నిర్వహిస్తున్నట్లు కళా జ్యోతి పాలకవర్గం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చదరంగం ఉదయం 10 నుంచి 11 గంటలకు, కనీస వయస్సు 8 సంవత్సరాలు ఉండాలని తెలిపారు. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఉదయం 6 నుండి 8 వరకు కనీస వయస్సు 10 సంవత్సరాలు నుండి ఉండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తిగల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9177032075కు గాని, 9908041612 కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img