Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం..

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్య నిర్వహణ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్
విశాలాంధ్ర- ధర్మవరం:: వెయ్యి దూడలు మాత్రమే ఇవ్వగలిగే లింగ నిర్ధారణ నిర్ధారిత వీర్యం వినియోగం కొరకు ఉచిత గర్భకోష చికిత్స శిబిరమును మండల పరిధిలోని వసంతపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహన అధికారి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ హాజరై పలు విషయాలను పశు పెంపకపుదారులకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ లింగ నిర్ధారిత వీర్యము అత్యధిక ప్రాచుర్యం పొందుతుందని గ్రామములో అత్యధిక పాడి కొరకు పేయి దూడలు మాత్రమే పొందే ఆధునిక సాంకేతిక విప్లవముగా ఈ పథకమును మారగలదని ఆశాభావాన్ని వ్యక్తం పరిచారు. అదేవిధంగా సుమారు 53 పశువులకు గర్భకోశ వ్యాధుల పరీక్షలు కూడా నిర్వహించారు. నట్టాల నివారణ మందులు 41 వాటికి తాపారు. సాధారణ కేసులు 18 చూసి వాటికి తగు వైద్యము తో పాటు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యంగా పాడి పశువులలో మంచి కట్టు శాతం రావడానికి ఆఖరి దశలో ఉన్నప్పుడు కృత్రిమ గర్భధారణ చేస్తే మాత్రమే చూడు నిలుస్తుందని తెలుసుకోవడం సుమారు 10-15 ఏదో లక్షణాలు ఉన్నప్పటికీ రెండూ లేదా మూడు చూపిన ఆ పశువు ఎదలో ఉందని రైతులు తెలుసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా స్థానికంగా విరి విరిగా లభ్యమగుచున్న శుభాబుల్ ఆకు వాడకం, ఈనెల మూడు నెలల లోపే కృత్రిమ గర్భధారణ చేయించడం, ఎదసూది చేసిన తర్వాత 20 రోజులపాటు బెల్లము నీళ్లు, టెంకాయనీలు లాంటివి త్రాగించడం, రోజుకి నూరు గ్రాముల ఎముకుల పొడి తినిపించడం, మునగాకు, కరివేపాకు మేపడం లాంటివి, చిన్న, చిన్న చిట్కాలు పాటించడం లాంటి విషయాలను రైతులకు ప్రత్యేక అవగాహన కింద తెలపడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పశువైద్యులకు ప్రత్యేక శిక్షణ మేలుకోలను కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ కే. శేఖర్, చింతలపల్లి ఏ హెచ్ ఏ ఎస్, జి ఎం ఎస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img