విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈనెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21వ 22వ రెండు రోజులు పాటు ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్, ప్రత్యేక ఆహ్వానితులుగా పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు.