Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

వృద్దుడుని ఆదుకోండి..

కుటుంబానికి సమాచారం అందించినా… స్పందించలేదు.

నేడు మానవతా విలువలు పట్టించుకోని సమాజం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో దాదాపు 85 సంవత్సరాలు వయస్సు కలిగిన గంగయ్య అనే రుద్రుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. వివరాలకు వెళితే కడప జిల్లా పులివెందులకు చెందిన గంగయ్య గత కొన్ని సంవత్సరాల కిందట కుటుంబాల కలహాల వల్ల ధర్మవరమునకు వచ్చాడు. అప్పటినుంచి తాసిల్దార్ కార్యాలయం బయట ఉన్న ఓ చిన్ని టీ కొట్టులో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. తదుపరి గంగయ్య గత కొన్ని రోజులుగా పూర్తి అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉండిపోయాడు. టీ కొట్టు నడుపుతున్న ప్రకాష్ అతనిని తాసిల్దార్ కార్యాలయ ఆవరణములో కొంతమంది వ్యక్తుల సహాయంతో అక్కడ పెట్టించాడు. కానీ తాసిల్దార్ కార్యాలయం కోవచ్చు ప్రజలకు ఈ దృశ్యం చూసి అయ్యో అని తెలుపుతున్నారు. అంతేకాకుండా అతని మలమూత్రాలు కూడా అక్కడే చేసుకోవడంతో దుర్వాసన కూడా వెదజల్లుతుంది. ఈ సమాచారాన్ని పులివెందులలో గల కుటుంబ సభ్యులకు తెలిపిన ఫలితం లేకపోవడంతో, గంగయ్య ప్రాణం పోయేలా ఉందని, స్థానికులు తెలుపుతున్నారు. ఈ సమాచారాన్ని వన్ టౌన్ పోలీసులు కూడా స్థానికులు తెలిపారు. ఈ వృద్ధుని ఈ స్థితికి తెచ్చిన కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, గంగయ్య ప్రాణాలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మానవతా విలువలు పడిపోయేలా సమాజంలో ఆగుపడడం దురదృష్టకరం, బాధాకరమని పలువురు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img