Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మౌలానా అబుల్ కలాం ఆజాద్ అడుగుజాడల్లో నడవాలి.. హెడ్మాస్టర్ సివి.శేషు.

విశాలాంధ్ర ధర్మవరం:: మౌలానా అబుల్ కలాం ఆజాద్ అడుగుజాడల్లో అందరూ నడవాలని హెడ్మాస్టర్ సివి. శేషు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ నిర్వహించారు. అనంతరం సివి శేషు మాట్లాడుతూ భారత దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి అబుల్ కలాం ఆజాద్ అని, అదేవిధంగా ఉర్దూలో ఆల్ హిలాల్ వారపత్రిక, ముస్లింల మధ్య విప్లవాత్మకమైన భావాలను పెంచడానికి ప్రారంభించి, అల్ హిలాల్ మోర్లో వింటూ సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య జలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం, ముస్లిం వర్గాల మధ్య ఐక్యత కుదరచ్చడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగిందని తెలిపారు.1916 లో ప్రభుత్వం పత్రికను నిషేధించి, రాంచీలో ఆజాద్ను నిర్బంధించారు అని తెలిపారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత విడుదల చేశారని తెలిపారు. ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటీష్ వ్యతిరేక భావాలను పెంచడం జరిగిందని తెలిపారు. భారత స్వాతంత్ర ఉద్యమానికి కూడా అబుల్ కలాం మంచి పాత్ర వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img