జిల్లా అధ్యక్షులు సయ్యద్ రోషన్ జమీర్
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రోషన్ జమీర్ ఆధ్వర్యంలో హిందూపురం పార్లమెంటు సభ్యులు పార్థసారధిని అనంతపురం నగరంలోని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకముగా కలిసి, పుష్పగుచుమిచ్చి, శుభాకాంక్షలు తెలపడం జరిగిందని తెలిపారు. అనంతరం ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారి సంక్షేమం కోసం సహకారం అందజేయాలని కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా మై ముస్లిం మైనారిటీ సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్, ఎం ఎం డి ఏ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.