Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మానవతను చాటుకున్న మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ దంపతులు కాచర్ల లక్ష్మి, కాచర్ల అంజి పట్టణంలో తమదైన శైలిలో పేద ప్రజలకు, వివిధ వర్గాల వారికి తమదైన శైలిలో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని తారకరామాపురంలో గల శ్రీ జానకి రాముల దేవాలయ నిర్మాణమునకు తమ వంతుగా పదివేల రూపాయల విరాళమును వారు అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణ కమిటీ వారు ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి దంపతులు మాట్లాడుతూ ఆలయాలకు, అనాధలకు, పేదలకు తమ వంతుగా ఉన్నదాంట్లో సేవ రూపేనా విరాళాన్ని అందజేస్తే, అది భగవంతుని సేవ అవుతుందని తెలిపారు. ప్రతి వ్యక్తి భక్తితో పాటు దాన గుణమును కూడా అలవర్చుకోవాలని తెలిపారు. అప్పుడే పేదరికం కొంతవరకు అయినా చేదించవచ్చునని తెలిపారు. ఆలయాలలో భక్తి భావంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img