Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ప్రారంభమైన నామినేషన్లు

రిటర్నింగ్ ఆఫీసర్ ఎం. వెంకట శివరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన ఉన్నందున, ఈనెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఎం. వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించబడునని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులలో ఉండదు అని తెలిపారు. నామినేషన్ను వేసేవారు 4 సెట్లు వేయవచ్చునని తెలిపారు. అభ్యర్థితో పాటు మొత్తం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల అభ్యర్థులకు హెల్ప్ అండ్ డెస్క్ అనే సహాయక కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ డిస్క్ ద్వారా నామినేషన్ లో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్కు చివరి తేదీ ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ పరిశీలన ఈనెల 26న ఉంటుందని, నామినేషన్ ఉపసంహరణ 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల వరకు అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు. కావున నామినేషన్ వేసే అభ్యర్థులు పై విషయాలను గమనించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు, సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. మొదటి రోజు నామినేషన్ను వైయస్సార్సీపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమర్పించడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img