Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

పారదర్శక తో కూడిన విధులను నిర్వర్తించాలి..

ఆర్డీవో, ఈఆర్వో . ఎం. వెంకటశివరాం రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం;; పారదర్శకతో కూడిన విధులను బిఎల్వోలు బిఎల్ఏలు నిర్వర్తించి ఓటర్ జాబితాను తయారు చేయాలని ఆడియో ఎం. వెంకట శివ రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్డిఓ ఛాంబర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి, అర్హత కలిగిన వారందరికీ ఓటు హక్కును కల్పించాలని, ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తాగు ఇవ్వకుండా ఖచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయవలసిన బాధ్యత బి ఎల్ ఓ, బి ఎల్ఏ దే న ని తెలిపారు. గత కొన్ని నెలలుగా ఫారం-6,7,8 లలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, సరి అయిన విచారణతో కచ్చితంగా సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. బి ఎల్ ఏ లు, బి ఎల్ వోలు సమన్వయంతో పని చేసినప్పుడే, అందరికీ సమ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డిఎల్ఓ లు, బి ఎల్ ఏ లు సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. ఈ ఓటు నమోదు కార్యక్రమంలో బదిలీలు చేర్పులు తొలగింపులు సవరణలు విషయములో అన్ని పార్టీల వారు తమ సహాయ సహకారాలను అందిస్తూ, మంచి ఓటరు జాబితాను తయారు చేయాలని వారు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డీఏవో రమేష్ బాబు, వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img