Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఉచిత వైద్య శిబిర కరపత్రాలు విడుదల.. రోటరీ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా, ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో శిబిర కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం శంకర కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అంద త్వ నివారణ సంస్థ- అనంతపురం వారి సహాయ సహకారములతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శిబిరా దాతలుగా దాసరి నారాయణప్ప జ్ఞాపకార్థం వీరి సతీమణి దాసరి బసమ్మ, కోడలు దాసరి లక్ష్మీ దేవమ్మ కుమారుడు దాసరి రామచంద్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో కంటి వైద్య చికిత్సలు పొందిన వారిలో అర్హులైన ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచితంగా ఆపరేషన్ తో పాటు రవాణా ఖర్చులు ఉచిత అద్దాల పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. శిబిరానికి వచ్చువారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా గుర్తింపు ఓటర్ కార్డు, సెల్ నెంబర్ తో కూడిన చిరునామాతో రావాలని తెలిపారు. అదేవిధంగా శిబిరానికి వచ్చువారు ఈ హెచ్ ఎస్ కార్డు గాని ఆరోగ్యశ్రీ కార్డు గాని మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని రావలసిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకొని తగ్గించుకొని రావాల్సి ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని, కంటి కు మంచి కంటి చూపును తెచ్చుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9440929894 కు గాని 9493361692 కు గాని 994937590కు గాని సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img