Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మున్సిపల్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడండి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండనగర పంచాయతీ పరిధిలో 2వ వార్డ్ తిమ్మాపురం ఇందిరమ్మ కాలనీ నందు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలం ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన స్థలంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కావున అధికారులు సదరు భూమిని అన్యా.క్రాంతము కాకుండా కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, సదరస్థలములో మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తే 10 కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది. నూతనంగా ఏర్పడిన పెనుకొండ మున్సిపల్ కు ఆదాయం కూడా వస్తుందని తెలియజేస్తూ గురువారం పెనుకొండ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు , ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ సోమశేఖర్ శ్రీ సత్య సాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏనుముల రామకృష్ణ, అంగడి రామాంజనేయులు, రవి,బండారు నాగప్ప, హనుమంతు యాదవ్, ముత్యాలమ్మ, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img