Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానం. శ్రీ సత్య సాయి భజన మండలి

విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు పాలు, బ్రెడ్, బిస్కెట్లను పంపిణీ చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, దాతలకు ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వ్యక్తి తనకు ఉన్న దానిలో దాన సేవను అలవర్చుకోవాలని తెలిపారు. అప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నజీర్, మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి భజన మండలి వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు నిజంగా రోగులకు వరంగా మారాయని తెలిపారు. వీరు ఉదయం పూట అల్పాహారం తో పాటు మరికొన్ని రోజులు భోజన పంపిణీ కూడా చేయడం నిజంగా అభినందించే తగ్గ విషయం అని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు చేయూత ఇస్తున్న దాతలకు, శ్రీ సత్య సాయి భజన మండలి వారికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తరపున వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img