Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పేద ప్రజలకు వైద్య చికిత్సలు అందించడంలో ఎంతో సంతృప్తి

దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు వైద్య చికిత్సలు అందించడంలో ఎంతో సంతృప్తి ఉందని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కోశాధికారి, గౌరవ అధ్యక్షులు దాసరి వెంకటేశులు (చిట్టి), అధ్యక్ష కార్యదర్శులు బివి. రమణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ళ అశ్వర్థ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగాపట్టణములోని తొగటవీధిలోగల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణముందు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 97వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు దాసరి వెంకటేశులు, అధ్యక్ష కార్యదర్శులు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించామని తెలిపారు. మొత్తం 240 మంది రోగులు కు నిష్ణాతులైన వైద్యులచే వైద్య చికిత్సలు అందించి, నెలకు సరిపడా మందులను దాతల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు చింతా లక్ష్మీనరసమ్మ, కీర్తిశేషులు చింతా రామకృష్ణా జ్ఞాపకార్థం వీరి కుమారులు చింతా వెంకట రంగయ్య అండ్ చింతా కృష్ణమూర్తి పేరిటన ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఘనంగా సత్కరించి, హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశా రు. అదేవిధంగా ప్రముఖ వైద్యులైన డాక్టర్ వివేక్ కుల్లాయప్ప- దంత వైద్యులు, డాక్టర్ వెంకటేశ్వర్లు-చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సాయి స్వరూప్-జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జై దీపు నేత- గ్యాస్ట్రో అండ్ లాప్రోస్క్ సర్జన్) మంచి వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి కూడా తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిరివెళ్ల రాధాకృష్ణ, చందా జై చంద్ర, డాక్టర్ వినయ్ కాచర్ల నారాయణస్వామి, విజయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img