ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యం. ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం పౌర్ణమి గరుడ సేవను సాయంత్రం 6 గంటల నుండి వైభవంగా ధర్మవరం పురవీధుల గుండా బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి గరుడ సేవకు ఉభయ దాతలుగా గ్రామ పురోహితులు సరస దత్తమూర్తి, సౌందర్యలహరి, కుమారుడు కాశీ విశ్వనాథ శర్మాలు వ్యవహరిస్తారని తెలిపారు. గరుడ సేవను ప్రతినెల దాతల సహాయ సహకారములు తో నిర్వహిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పౌర్ణమి గరుడసేవ పూజలను సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు కోనేరా చార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్లు నిర్వహిస్తారని తెలిపారు. వివిధ పూలమాలలతో గరుడ సేవకు ప్రత్యేక అలంకరణ ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని పౌర్ణమి గరుడ సేవను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుండా చౌడయ్య, ఆలయ పాలక సభ్యులు పాల్గొన్నారు.