Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

లాయర్ బాల సుందరి, ట్రాఫిక్ కానిస్టేబుల్ నారాయణస్వామి
విశాలాంధ్ర ధర్మవరం:: వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని లాయర్ బాలసుందరి, ట్రాఫిక్ కానిస్టేబుల్ నారాయణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మోటార్ వాహన చట్టాల మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని, టూ వీలర్ లో హెల్మెట్, ఫోర్ వీలర్ లో బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. ఇలా పెట్టుకోవడం వలన ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయం తగలకుండా కాపాడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మైనర్లు వాహనాలను నడపరాదని, తల్లిదండ్రులు ప్రోత్సహించరాదని తెలిపారు. నియమ నిబంధనలు తెలియని మైనర్లు వాహనాలు నడిపితే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు ఈ అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు కూడా తమ కుటుంబంతో పాటు పరిసర ప్రాంతాలలో ఉన్న వారికి కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుట, మద్యం సేవించి వాహనాలు నడుపుట చట్టరీత్యా నేరము అని తెలిపారు. రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్లను గమనించుకుంటూ ప్రయాణం చేయాలని, అతివేగంతో పోతే ప్రాణాలు కూడా పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి కాంత్ రెడ్డి, అధ్యాపకులు, బాలికలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img