Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, మెడికల్ ఆఫీసర్లు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, పిపి యూనిట్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సురేష్ నాయక్ ,డాక్టర్ శ్రావణి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కూడలిలో ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ మాధవి తోపాటు మెడికల్ ఆఫీసర్లు మాట్లాడుతూ ప్రపంచ జనాభా వలన కలుగు నష్టాలు, లాభాలను తెలియజేయడానికే ర్యాలీలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జనాభాను నియంత్రణలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ముఖ్యంగా కాన్పుకు కాన్పుకు మధ్య ఎడమ పాటించవలెనని, బాల్య వివాహాలను నియంత్రించడం (ఫ్యామిలీ ప్లానింగ్) కుటుంబ నియంత్రణ పాటించడం పిల్లలు పుట్టకుండా తాత్కాలిక పద్ధతులు పాటించడంలో అంతర ఇంజక్షన్, కండోమన్స్ వాడడం, తదితర పద్ధతులు పాటించాలని తెలిపారు. శాశ్వత పద్ధతిలో మహిళలకు విక్టరీ పురుషులకు వికట్టమి పాటించడం వల్ల చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అవుతుందని తెలిపారు. దేశ సమగ్రతను కాపాడుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శనమల పీహెచ్సీ డాక్టర్ పుష్పలత, గైనకాలజిస్ట్ డాక్టర్..శైలజ, యూపీహెచ్సి డాక్టర్ శ్వేత, డాక్టర్ ప్రియాం, అర్బన్ ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లు అన్న లక్ష్మీనారాయణ, జ్యోతి, సునీత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img