Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఆదర్శపాఠశాలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రిన్సిపాల్ ఎం ఈశ్వరరావు
విశాలాంధ్ర-కవిటి:మండలo లోని రాజపురం ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం ఈశ్వరరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ,సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్యా బోధన అందిస్తున్నట్టు పేర్కొన్నారు.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో 10 వ తరగతి పూర్తి అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ నెల 28 నుండి మే 22 వరకు ఓసీ,బిసి, ఈడబ్యూఎస్ విద్యార్థులు 200 రూపాయలు,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు 150 రూపాయలు దరఖాస్తుకు రుసుము చెల్లించాలన్నారు.అనంతరం విద్యార్థికి కేటాయించే జనరల్ నంబరు ఆధారంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మార్కుల మెరిట్,రిజర్వేషన్ రూల్స్ ప్రకారం,ప్రవేశాలు కల్పిస్తామని పేర్కోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img