Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు మానుకోండి

ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమూర్తి
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులపై కక్ష సాధించే విధంగా విద్యాశాఖ ఉన్నతాధికారి, విద్యా శాఖలో చాలామంది కింద స్థాయి అధికారులు ఉన్న వాళ్లంతా దండగ అనే విధంగా ” ఒకే ఒక్కడి ” తరహాలో అర్ధరాత్రి పర్యటన ఆపి, ప్రస్తుతం వీడియో కాల్ చేస్తూ, నోట్స్ పుస్తకాల్లో టిక్కు పెట్టలేదని నెపంతో తన దగ్గరికి పిలిపించుకొని ఉపాధ్యాయ లోకాన్ని భయభ్రాంతుల కు గురి చేస్తున్నారు అని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమూర్తి అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు . ఇలాంటి కక్ష సాధింపు చర్యల పై విద్యాశాఖ గాని, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.ఉపాధ్యాయులు అమరావతి వెళ్లిపోతే పరీక్షలు ఎవరు నిర్వహిస్తారు, ప్రయాణ ఖర్చులు ఎవరు భరిస్తార ని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల ‘ అవిశ్రాంతికి గురిచేసి విద్యా బోధన సాగించడం కష్టమని ఆ అధికారికి తెలియదా లేదా ఎవరు మెప్పు కోసం ఈ చర్యలు చేస్తున్నారా అంటూ మండి పడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఇటువంటి చర్యలపై తక్షణమే పోరాటం చేస్తుందన్నారు. గత సంవత్సరం బేస్ లైన్ టెస్ట్ లు, సి బి ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత కంప్యూటర్ ద్వారా ఓఎంఆర్ షీట్లు ఇంతవరకు మూల్యాంకం చేసి ఫలితాలు తెలియజేయిని ప్రభుత్వం హడావిడిగా షెడ్యూల్ ఇస్తూ కరెక్షన్ల పేరుతో ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించారు. హితవు పలికారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సిఫారసు బదిలీలు రద్దు చేయాలని, అక్రమంగా వసూలు చేసిన లక్షల రూపాయల అవినీతిపై విచారణ చేపట్టి బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో వేల కొలది ఉపాధ్యాయులు బదిలీలు, పైరవీలు, ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్ల దగ్గర, పడిగాపులు కాస్తున్నారని, మధ్యవర్తులు, దళారీలు,ఒక్కొక్క ఉపాధ్యాయుని దగ్గర మూడు,నాలుగు లక్షలు వసూలు చేస్తున్నారని,దీని వల్ల ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న కౌన్సిలింగ్ విధానం అర్థం లేకుండా పోయిందని వాపోయారు. ఉన్నవాడిదే రాజ్యం, రాజకీయ నాయకుల అనుచరులకే కోరుకున్న పాఠశాలలు కేటాయిస్తున్నా రని, తక్షణమే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీ వేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాజస్థాన్, ఛత్తీస్గడ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తదితర రాష్ట్రాలలో పాత పెన్షన్ అమలు చేయగా లేనిది ఏపీ లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ”వై నాట్ ఓపీఎస్” డిమాండ్ తో ఉమ్మడి ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికు పెన్షనర్లు ఎదురుచూస్తు న్నటువంటి 12వ పిఆర్సి కమిషన్ ప్రకటించినప్పటికీ, దానికి సంవత్సర కాలం టైం ఇవ్వడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడమేనని దానికి బదులుగా తక్షణం 50 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది ఉపాధ్యాయులు గత రెండు మాసాలుగా జీతాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారని దీనికి ప్రధాన కారణం సవరించిన కేడర్ స్ట్రెంత్ వివరాలు సమర్పించ కుండా అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణమని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణం జీతాలు చెల్లించకపోతే ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు తక్షణం అమలు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు నిర్వహించాలని, నూతనంగా నియమించబడిన 679 మంది మండల విద్యాధికారులకు అధికారాలు విధులు స్పష్టం చేయాలని, ప్రభుత్వములో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, భవిష్యత్తు సౌకర్యం కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 20 వేల ఉపాధ్యాయ ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల మీద అలుపెరుగని పోరాటానికి ఎస్టీ యూ సిద్దంగా ఉందని రమణ మూర్తి ప్రకటన లో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img