రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చునన్న వాతావరణ కేంద్రం
మూడు రోజుల పాటు జిల్లాల్లో బలమైన గాలులు వీచే అవకాశముందని వెల్లడి
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు ఉంటాయన్న వాతావరణ కేంద్రం
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చునని తెలిపింది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల బలమైన గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు ఉండవచ్చునని తెలిపింది.