Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

సాయిచంద్ కు మంత్రులు కేటీఆర్, సబిత నివాళి

  • ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి .. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. సాయిచంద్‌ అద్భుతమైన కళాకారుడని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్‌ మరణం తీరని లోటని తెలిపారు. కేటీఆర్‌, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, రసమయి బాలకిషన్‌, టీఎస్‌ఎమ్మెస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img