Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

పెంచిన టెట్ ఫీజు త‌గ్గించండి

రేవంత్ కు బాల్క సుమ‌న్ లేఖ
టెట్‌ ఫీజు పెంపు సరికాదని మాజీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి సుమన్‌ లేఖ రాశారు. టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచిందని.. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే రూ.200ల ఫీజు, రెండోసారి రాసిన వారికి రూ.300 ఫీజు మాత్రమే వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు పేపర్‌కు రూ.1,000.. రెండు పేపర్లకు రూ.2వేలకు పెంచడం సరికాదన్నారు. పెంచిన ఫీజులతో నిరుపేద, మధ్యతరగతి అభ్యర్థులపై చాలా భారం పడుతుందన్నారు. కేవలం 11 జిల్లా కేంద్రాల్లోనే టెట్ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. దాంతో మిగతా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడతారన్నారు. దూరభారంతో పాటు ఆర్థికంగా భారపడుతుందన్నారు. మొత్తం 33జిల్లా కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగలరని డిమాండ్‌ చేశారు. 7లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని పెంచిన ఫీజులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img