Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో విడుదల

లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్ రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా దీన్ని తయారు చేశామని వివరించారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img