Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

యువ జంట ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసు కోవడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పకీరాబాద్- మిట్టాపూర్ మధ్యలో రైలుపట్టాలపై సోమ వారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్(28) శైలజ(24)కు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. బంధువుల వేధింపుల దుష్ట ప్రచారం తట్టుకోలేక తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు యువకుడు తన సెల్ ఫోన్ నుంచి సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి పోలీసులకు పంపించారు. దుష్పప్రచారాలను తట్టు కోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసు కుంటున్నామని తమ బాధను వీడియో రూపంలో చిత్రీకరించారు. దీంతో పోలీసులు వారి ఫోన్ ని ట్రాక్ చేసి ఆ దంపతులను కాపాడడానికి చేసిన ప్రయత్నం ఫలిం చలేదు. చివరికి పోలీసులు పకీరాబా ద్-మిట్టాపూర్ పట్టాల పరిసర ప్రాంతాల్లో పట్టాలపై వారి మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img