Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ కు సన్మానం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బిజెపి సీనియర్ నాయకుడు అంబటి సతీష్ కుమార్ ను ఆ పార్టీ నాయకత్వం జాతీయ కౌన్సిల్ మెంబర్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు అంబటి సతీష్ ను పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబటి సతీష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గొట్లురు చంద్ర, కన్వీనర్ అరవింద్ రెడ్డి, నాయకులు రాప్తాటి రాము ,దుస్సా కృష్ణ ,గుండా పుల్లయ్య, నారాయణస్వామి యాదవ్, నబి రసూల్, గంధమనేని నారాయణస్వామి, పండగ హరికృష్ణ, అంబటి బద్రీనాథ్, మైలవరం సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img