Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జిల్లాలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ నిర్వహణకు చర్యలు

విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లాలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. పగడాలమ్మ తెలిపారు. సమగ్ర శిక్ష పార్వతీపురం మన్యం జిల్లా ఆధ్వర్యంలో
3 సంవత్సరముల నుండి 18 సంవత్సరములు గల దివ్యాంగులయి చదువుకునే విద్యార్థులు వైకల్యత్వమును నిర్ధారించుటకు గాను నిపుణులు అయిన వైద్యుల పర్యవేక్షణలో మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ జిల్లాలోని వివిధ డివిజన్లలో క్రింది తెలిపిన తేదీలలో నిర్వహించబడునని తెలిపారు. మంగళ వారం భవితకేంద్రం, కురుపాం ఎం ఆర్ సి కేంద్రం వద్ద కురుపాం,జియ్యమ్మవలస,గుమ్మలక్ష్మి పురం మండలాలకు కలిపి నిర్వహించబడునని తెలిపారు.
ఈనెల27న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నర్సిపురం, మెయిన్ రోడ్డువద్ద పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, బలిజిపేట, సీతానగరం, మండలాలకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈనెల28న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ రామకాలనీ సాలూరువద్ద సాలూరు, మక్కువ,పాచిపెంట మండలాలకును, ఈనెల 30న పాలకొండ భవితాకేంద్రం ఎంఆర్సి వద్ద పాలకొండ భామిని సీతంపేట వీరఘట్టం వద్ద నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.ఆయామండలాల ప్రజలు
ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.వైకల్య నిర్ధారణ జరిగిన తర్వాత వారికి తగ్గ ఉపకరణములు అందజేయబడునని తెలిపారు . కావున తల్లిదండ్రులు
ఈఅవకాశమును ఉపయోగించుకోవలెనని,క్యాంపుకు హాజరైన పిల్లలకు, వారితల్లిదండ్రులకు ఉచితభోజనం మరియు రవాణాఖర్చులు ఇవ్వబడునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img