Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం..

మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, డిప్యూటీ బియ్యం అండ్ హెచ్ వో- సెల్వి సాల్మన్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలియో చుక్కల నిర్వహణ కార్యక్రమం మొదటి రోజు ఆదివారం సజావుగా జరుగుతూ విజయవంతం కావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ వో సెల్వియా సాల్మాన్, రూరల్ ఇన్చార్జ్ డాక్టర్ పుష్పలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 61 పల్స్ పోలియోకేంద్రాలు, రూరల్ పరిధిలో 49 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో రైల్వేటేషన్, ఆర్టీసీ బస్టాండ్ వివిధ కళ్యాణ మండపాలు, ముఖ్యమైన కూడలిలలో ఈ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో 0-5 సంవత్సరాల ఉన్న పిల్లలు 16,800 మందికి గాను 16,453 మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని, అదేవిధంగా రూరల్ పరిధిలో 4,436 మందికి గాను 4,348 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. పట్టణంలో 97 శాతము నమోదు కాగా, రూరల్ పరిధిలో 98 శాతము నమోదు కావడం జరిగిందని వారు తెలిపారు. మిగిలిపోయిన చిన్నారులకు మంగళవారం, బుధవారం రోజులలో పోలియో చుక్కల సిబ్బంది ఇంటింటికి వెళ్లి అనుకున్న టార్గెట్ ను పూర్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ పోలియో చుక్కల కార్యక్రమానికి విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, సిబ్బందికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img