Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

పీహెచ్ సీ లో 13 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

విశాఖ జిల్లా, అనందపురం మండలం : మండలం లోని ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో గురువారం 13 మంది కి టూబెక్టమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు నిర్వహించారు. కే జి హెచ్ నుంచి వచ్చిన శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ బి . ఆనంద్ ఈ శస్త్ర చికిత్సలు చేసారు. మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది మహిళలకు ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీ హెచ్ సీ వైద్య అధికారులు డాక్టర్ ఎం. గంగు నాయుడు, డాక్టర్ షేక్ షహనాజ్ సాధియా, సామాజిక ఆరోగ్య అధికారి పి సాంబమూర్తి , ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img