విశాఖ జిల్లా
విశాలాంధ్ర ,ఆనందపురం
మండలంలో జనసేన రూరల్ పార్టీ కార్యాలయం ఆనందపురం జంక్షన్లో సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి ఒకటి వేడుకలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు తమ్మిన అప్పలరాజు ఆధ్వర్యంలో జనసేన రూరల్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి ముఖ్య అతిథిగా భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల విచ్చేశారు . సోమవారం ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో , పార్టీ నాయకులు వీర మహిళలు అలాగే 3 మండలాలు పార్టీ నాయకులు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు వీర మహిళలు, నాయకులు, టిడిపి నాయకులుతో సందడి వాతావరణం అంగరంగ వైభవంగా పార్టీ కార్యాలయం వేడుకవలే మారింది. అందరూ భీమిలి ఇన్చార్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిఎంసి వార్డు అధ్యక్షులు ,శాకరి శ్రీనుబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి మజ్జీ శ్రీను, మండల అధ్యక్షులు తమ్మిన అప్పలరాజు, ఉపాధ్యక్షులు తాడివాడశివకృష్ణ, బాలు,ఆర్గనైజింగ్ సెక్రటరీ, జాన.కృష్ణ,సెక్రటరీలు బొద్దపు గోవిందు, డాక్టర్ పిన్నింటి సన్యాసిరావు, ప్రశాంత్, సురేష్, నియోజకవర్గ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.