Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

కొండస్థలం కబ్జా….. ప్రభుత్వ స్థలాన్ని కూడా వదలని అక్రమార్కులు

విశాలాంధ్ర- ఆనందపురం : మండలంలో బాలబాలికల హాస్టల్ పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి అక్రమంగా స్థల నిర్మాణాలు చేపడుతున్నారు అలాగే ఈ స్థలంలో కొందరు అండదండలతో రాత్రి వేళల్లో రేకుల షెడ్డు నిర్మాణాలు జోరుగా సాగిస్తున్నారు. దానికి తోడు హాస్టల్ ప్రహరీ గోడకు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం వాళ్ల గుప్పెట్లో పెట్టుకొని గోడ చుట్టూ పశువులను పెట్టి అపరిశుభ్రంగా తయారు చేస్తూ బాలబాలికలు హాస్టల్ నుంచి బయటికి రావాలంటే తరచూ ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంపై అనేకసార్లు కొందరు ఫిర్యాదు చేసినప్పటికీ అటు అధికారులలో ఎటువంటి చలనం లేదని బాలికల హాస్టల్ పక్కనే ఉన్న రోడ్డు స్థలాన్ని సైతం మూసివేశారు జంగాల కాలనీకి వెళ్లాలంటే కింద నుంచి ఈ రోడ్డు ఆధారం దాన్ని మూసి వేయడం వల్ల చుట్టూ తిరిగి కాలనీ ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. దానికి తోడు అక్కడ ఎవరైనా ఇంటి పనులు చేసుకుంటే వారిని కూడా తరచూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాదనైతే బలంగా వినిపిస్తుంది. అలాగే జూనియర్ కళాశాల కేటాయించిన స్థలం పక్కనే కొంత స్థలాన్ని షెడ్లతో నిర్మించి అక్రమదారులు ఇతరులకు క్రయవిక్రయాలు జరుపుతున్నారని స్థానికుల వాపోతున్నారు గతంలో కూడా ఇక్కడ ప్రభుత్వ స్థానంలో ప్రైవేటు వ్యక్తులు కొందరు సీసీ కెమెరాల అమర్చి జనం రాకపోకలను నిత్యం పర్యవేక్షణ చేసేవారు కొంతమంది ఫిర్యాదుతో కెమెరాలు తొలగించారు. సదర్ వ్యక్తులపై బుడగ జంగాల కాలనీ వాసులు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ విషయంపై అధికారులు ఎటువంటి చలనం అయితే లేదు. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు వాపోయారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులతో తీసుకొని ప్రభుత్వ స్థలంలో ఉన్న వారిని ఖాళీ చేయించి హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పిల్లలకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వ స్థలాలను ఖబ్జా చేసే వారిని కఠినంగా శిక్షించి రోడ్డుపై ఉన్న ఆక్రమ దారులను ఖాళీ చేయించాలని దానికి ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img