Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

40 మంది సిఆర్పిఎఫ్ అమరులైన జవాన్లకు నివాళులు

విశాలాంధ్ర – ఆనందపురం : జమ్మూ కాశ్మీర్ పులుమామ దాడిలో భారత సిఆర్పిఎఫ్ సైనికులు 40 మంది అమరులైన జవాన్లకు ఆనందపురం గ్రామం కళ్యాణ మండపం వద్ద జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవాన్లకు నివాళులర్పించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జేజవన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుప్ప రాజశేఖర్ మాట్లాడుతూ ఆరోజు జరిగినటువంటి దాడి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మన భారత సైనికుల్ని కార్ లో బాంబు పెట్టుకుని మన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై ఏ రకంగా దాడి చేశారని తెలియచేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ భారతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆనందపురం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అమరులైన జవాన్లకు భారతమాత ముద్దు బిడ్డలకు జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యాత సంక్షేమ సేవ సంఘం అధ్యక్షులు అంగటి రాము గారు మరియు స్వచ్ఛంద సేవకులు కొట్టాడా సత్యమూర్తి గారు కుప్ప అప్పలరాజు జై జవాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుప్ప రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ ముడసల శ్రీను జనరల్ సెక్రెటరీ ఏమంది శ్రీనివాసరావు . కుప్ప శ్రీను .కుప్ప చెంచునాయుడు కుప్ప సూరిబాబు. నాగల ముత్యాలు .పీతల శ్రీను ఎల్లయ్య. అప్పలరాజు. బద్రి కళ్యాణ్ .హరి మొదలగు ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img