Friday, April 19, 2024
Friday, April 19, 2024

“బాబు చెంతకి…బ్రహ్మణాస్త్రం” ఇంటింటి ప్రచారం

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్: విజయనగరం పట్టణం 9వ డివిజన్ దాసన్నపేట రైతు బజార్, గెడ్డ వీధి, సుబ్రమణ్యపేట, మహారాణి పేటలో సోమవారం తెలుగుదేశం బ్రాహ్మణ కమిటీ నాయకులు “బాబు చెంతకి…బ్రహ్మణాస్త్రం” ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బ్రాహ్మణులపై దాడులు, హిందూ దేవాలయాలపై దాడులు మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం ఇలా అన్ని విధాలుగా బ్రాహ్మణ జాతికి తీవ్రమైన అన్యాయం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. బ్రాహ్మణులకు న్యాయం జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అందుచేత సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా-జనసేన-బీజేపీ విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పేరి రామయ్య పంతులు, ద్వాదశి వేణు, వడ్లమానిసభద్ర, వడ్లమాని శేఖర్, ఇనుగంటి రాకేష్, సంబర సన్యాసిరావు, బండి మహాలింగేశ్వర శర్మ, దవల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img