Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

నీటి ని వృధా చేయకండి

ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఇ బి.ఉమాశంకర్

విశాలాంధ్ర విజయనగరం : నీటిని పొదుపుగా వాడడం వల్ల భావితరాలు నీటి సమస్యకు గురికారనీ ప్రాణాధారమైన నీటిని పొదుపుగా వాడాలని జిల్లా గ్రామీణ నీటిసరఫరా , పారిశుద్ధ్య విభాగం
పర్యవేక్షక ఇంజనీర్ బి ఉమాశంకర్ అన్నారు.ఆర్ డబ్ల్యు ఎస్ సమావేశ మందిరంలో మహారాజ అటానమస్ కళాశాల డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు నాలుగు నెలల ఇంటర్న్ షిప్ భాగంగా బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి ఆవశ్యకత ను ఉమాశంకర్ విద్యార్థులకుసోదహరణంగా వివరించారు.తాగునీటి నాణ్యత పరీక్షా విధానం,సురక్షితమైన తాగు నీరు పొందే విధానాలను తెలిపారు. జీవాధారమైన మైన నీటిని వృధా చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇఇ ఎవి మురళీ మోహనరావు,అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్ దుర్గా భవాని, జిల్లా వాటర్ క్వాలిటీ కన్సల్టెంట్ కె అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img