Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

పక్కిరవీంద్రనాథ్ సేవలు అభినందనీయం

విశాలాంధ్ర, పార్వతీపురం:గ్రామంలో పాఠశాల అభివృద్ధికి, విధ్యార్ధులను ఉత్తమ విద్యార్ధులుగా తయారు చేయడంలో ప్రదానోపాధ్యాయుడు పక్కి రవీంద్ర నాథ్ మాస్టారు చేసిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర నిర్వాసిత సంఘం రాష్ట్ర కార్యదర్శి బంటు దాసుబాబు అన్నారు. బంటువానివలస పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఇటీవల కొంకడివరం బదిలీపై వెళ్లిన పక్కిరవీంద్రను బంటువాని వలస గ్రామస్తులు,పాఠశాల సిబ్బంది, విధ్యార్ధులంతా ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు కె. సింహాచలం అధ్యక్షత రహించారు. ఈసమావేశంలో మాట్లాడిన పలువురు వక్తలంతా రవీంద్ర నాథ్ చేసిన సేవలను కొనియాడారు.
ఈసమావేశంలో అడ్డాపుశిల మాజీ సర్పంచు దాసుబాబుతోపాటు ఉప సర్పంచ్ పి. శివున్నాయుడు,
జి సూర్మనారాయణ, బిఎ. సరస్వతి, కె.రత్నం, బి, శిఇష్ కుమార్,
జి. సింహాచలం, కోటవానివలస పాఠశాల ఉపాధ్యాయులు పి. వెంకటనాయుడు,
కె తారకేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img