Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

మాదకద్రవ్యాలును అరికట్టాలి

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూర వాసు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న మత్తు మాదకద్రవ్యాలను అరికట్టాలని. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మయూరి జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బూర వాసు మాట్లాడుతూరాష్ట్రంలో అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి యువత బానిసలుగా మత్తు పదార్థాల అలవాటు పడినటువంటి ఈ మత్తు మాదక ద్రవ్యాలను అరికట్టాలి అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించండి అంటూ, వాటిని అరికడతామని,అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకుహామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
కానీ ఇంతవరకు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మత్తు పదార్థాలు యధావిధిగా కొనసాగుతూ యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.ఎందుకంటే దానికి కారణం ముఖ్యంగా జిల్లాలో జరిగినటువంటి మైనర్ బాలిక పై ఒక బాలుడు గంజాయి త్రాగి బాలికను కత్తి చూపించి బేధరించడమే దీనికి ముఖ్య నిదర్శనం అని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి యువకులను యువకుల ప్రాణాలను కాపాడాలని కోరారు,ఇంతవరకు మత్తుకు మాదకద్రవ్యాలకు యువత మాత్రమే బానిసలుగా మారుతున్నారు అనుకుంటే ఇప్పుడు స్కూల్ విద్యార్థులు మైనర్ విద్యార్థులు కూడా గంజాయి, గుట్కా, మత్తు మాదక ద్రవ్యాలకు బానిసలై వారు ఏం చేస్తున్నారో కూడా తెలియక అతి చిన్న వయసులోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారనివారు ఆవేదన వ్యక్తం చేశారు.మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యువతను విద్యార్థులను ఈ మత్తు బారిన పడకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వంశీ, నాగరాజు, శ్రీను, లోకేష్,తదితరులు పాల్గున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img