Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఎండలు మండిపోతున్నాయి

. ప్రచార కార్యక్రమాలలో అభ్యర్థులకు చెమటలు
. ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు బయటికి వెళ్లొద్దని హెచ్చరికలు

విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : గత మూడు రోజులుగా ఎండలు భగభగ మండిపోతున్నాయి ఒకసారి గా పెరిగిన ఈ ఉష్ణతాపానికి ప్రజలు అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాలకు కూడా వెళ్లేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు వెంట కార్యకర్తలు రాడానికి కూడా ఈ ఎండలకు భయపడి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఏప్రిల్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా ఎండలు ఈ విధంగా మండిపోతుంటే రానున్న కాలంలో ఏ విధంగా ఉంటాదో అని ప్రజలంతా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా గత మూడు రోజులగా 40 డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలంతా అల్లాడిపోతున్నారు.ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో ఇంటికి పరిమితం అవ్వాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.ఎండలు తీవ్రత పిల్లలు, వృద్దులపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు పిల్లలు వృద్ధులు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున బయటికి వెళ్లిన వారంతా మంచినీళ్లు,మజ్జిగ, గంజి , నిమ్మరసం వంటివి తీసుకుంటే మంచిది శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు పోయి డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రతి అరగంటకు ఒకసారి మంచినీళ్లు మజ్జిగ లేదా చల్లని పానీయాలు తీసుకోవడం మంచిది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.బయటికి వెళ్లే సమయంలో గొడుగు తెల్లని పలుచటి చేనేత వస్త్రం ధరించడం మంచిది. దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లంతా ఉదయం లేదా సాయంత్రం వెళ్లాలని పలువురు తెలుపుతున్నారు ఈ ఎండల తీవ్రతకు ముఖ్యంగా రిక్షా,ఆటో సామాన్య కార్మికులంతా తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ప్రస్తుతం ఎండల వేడి కన్నా ఎన్నికల వేడి మహా ఆసక్తిగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img