Monday, April 22, 2024
Monday, April 22, 2024

డ్రైనేజీ సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన…

విశాలాంధ్ర -ఉండి: పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం 6వ వార్డులో నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన రూ 10 లక్షల ఎంపీ నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి శనివారం టిడిపి పాలకోడేరు మండల అధ్యక్షులు కోటిరాజు, 6వ వార్డు మెంబర్ రఘువర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటిరాజు మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలను పరిశీలించి గ్రామాల్లో ఏ సమస్య ఉన్న స్పందిస్తూ ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. రఘురామకృష్ణంరాజు ఆంధ్రాలో అడుగు పెట్టకుండా అధికార పార్టీ ప్రయత్నించినా పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయాలన్న రఘురామ కృష్ణంరాజు సంకల్పానికి ఎవరు అడ్డుకోలేరని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు పాలకోడేరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ నిధులను మంజూరు చేసి పాలకోడేరు మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని అందుకు వారికి మండలం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అభివృద్దే ఆశయంగా పనిచేసిన రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ పరిధిలో ఉండి ఉంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్మ, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img