Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

త్రిబుల్ ఐటీ లో నలుగురు గురుకుల విద్యార్థులకు చోటు…

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్: పెద తాడేపల్లి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు త్రిబుల్ ఐటీ లో చోటు లభించిందని శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ బి. రాజారావు తెలిపారు గేదెల బాబి, అయినపర్తి వెంకట్ లకు ఒంగోలులోని త్రిబుల్ ఐటీలో, వడలి సురేష్ కుమార్,కనిపెడ కార్తీక్ లకు శ్రీకాకుళంలోని త్రిబుల్ ఐటీలో చోటు లభించిందని ప్రిన్సిపల్ తెలిపారు. తమ పాఠశాల చెందిన విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో సీట్లు సంపాదించడం గర్వ కారణం అన్నారు సీట్లు సాధించిన విద్యార్థులు మరింత ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు నలుగురు విద్యార్థులను డి సి ఓ భారతి, ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img