Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

తుఫాను రక్షిత భవనాలలో పటిష్ట ఏర్పాట్లు…

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి….

విశాలాంధ్ర -నరసాపురం: తుఫాను రక్షిత ప్రదేశాలలో పటిష్ట ఏర్పాట్లు చేశామని,గోదావరి పరివాహక, తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి కోరారు.శనివారం పురపాలక సంఘ పరిధిలో లాకులు, నరసాపురం మండలం ధర్భరేవు డ్రైన్, వేములదీవి నల్లిక్రిక్ , బియ్యపు తిప్ప తదితర ప్రాంతాలను, గోదావరి వరద ఉధృతిని జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారితో పాటు ఆయా సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయ కార్యక్రమాలు అందించుటకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు ఎవరికైనా డెలివరీ తేది దగ్గర పడిన వారు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బెడ్ రెస్ట్ తీసుకున్న వారిని స్థానిక ప్రభుత్వా సుపత్రిలో జాయిన్ చేయుటకు అన్ని చర్యలు తీసుకున్నా మన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అన్ని చర్యలు తీసు కున్నామని, వేటకు వెళ్ళనీయ కుండా గోదావరినది పరివాహక ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు పహారా చేస్తున్నామన్నారు. పడవలు, వలలు భద్రపరిచే విధంగా చర్యలుతో పాటు, మత్స్య కారుల మత్స్య సంపదను మార్కెట్ కు తరలించి అమ్మకం అయ్యేలా చూడాలని మత్స్య శాఖ అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. గోదావరి ఏటిగట్లును నిరంతరం పర్య వేక్షించాలని, బలహీనంగా ఉన్నట్లయితే యుద్ధ ప్రాదిపదికన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక బస్తాలు సిద్దం చేసుకుని పాయింట్లు వారీగా నిల్వలు పెట్టుకోవాలన్నారు. ఎటువంటి విపత్తుల పరిస్థితినైనా ఎదుర్కొ నేందుకు అధికారులు సిద్ధంగా ఉందని, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలన్నారు. పుకార్లు, వదంతులు నమ్మవద్దని అధికారులు సూచన సలహాలు పాటించాలని ప్రజలకు జిల్లా కలెక్టరు విజ్ఞప్తి చేశారు.అధికారులందరూ గత అనుభవాలు జోడించి పరిస్థితిని ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టిన తరువాత తగు నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు. వర్షాల కారణంగా కాలువలు, గుంటలు దాటవద్దని ప్రజలకు ఆమె సూచించారు. శిధిలా వస్ధలో ఉన్న ప్రవేటు, ప్రభుత్వ భవనాలు గుర్తించి సురక్షిత ప్రాంతాల్లో తరలించే చర్యలు తీసుకోవాలన్నారు.గోదావరిలో పడవలు రాకపోకలు జరగకుండా, పరివాహక ప్రాంతాల్లో ఎవ్వరూ సంచరించకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాల న్నారు. గోదావరి పరివాహక, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటడంతోపాటు, పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో అన్ని రకాలు మందులతోపాటు, పాము కాటు విరుగుడు మందును ఉంచి నిరంతరాయంగా పనిచేయా లన్నారు. మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ లు 24 గంటలూ పనిచేయా లని, ఫోన్ వచ్చిన వెంటనే స్పందించాలని ఆమె అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించేందుకు మంచినీళ్ల ప్యాకెట్లను అందు బాటులో ఉంచామన్నారు. తుఫాన్ రక్షిత భవనాలలో అన్ని ఏర్పాట్లు సిద్దం చేశామని లోతట్టు, తీరప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని జిల్లా కలెక్టరు కోరారు. విద్యుత్, రక్షిత మంచినీటి సరఫరాకు అంత రాయం కలగకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.జిల్లా కలెక్టరు వెంట సబ్ కలెక్టర్ యం. సూర్య తేజ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, తహశీల్దారు యస్ యం ఫాజిల్, వివిధ శాఖల మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img