Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మహిళలను వ్యాపారస్థులను చేయటం లక్ష్యం…

డిఆర్.డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు…

విశాలాంధ్ర -కొయ్యలగూడెం: జిల్లాలో వెయ్యి మంది మహిళలను వ్యాపారస్థులను చేయటం లక్ష్యమనీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్. విజయ్ రాజు తెలిపారు. శుక్రవారం కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తోట కృపామణి ఆధ్వర్యంలో చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు యూనిట్ ప్రారంభోత్సవం చేశారు. గుడ్ హెల్త్ ఫుడ్స్ పేరుతో మహిళలు తయారు చేసే ఉత్పత్తులు రుచి చూసి వాటిని తయారు చేసే యంత్రాలను ప్రారంభించారు. ఈ సంధర్బంగా జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ ముఖ్య అతిధిగా మాట్లాడారు. చిన్న గ్రామలో ఇలాంటి ఆరోగ్య కరమైన ఉత్పత్తులు మహిళలు తయారు చేయటం ముదావాహంగా పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో వెయ్యి మంది మహిళలను వ్యాపారస్థులుగా చేశామన్నారు. ఈ ఏడాది మరో వెయ్యి మందిని వ్యాపారస్థులుగా చేయాలని లక్ష్యంగా నిర్ధేశించామన్నారు. మహీళలు తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత ఉంటే తమ సంస్థ ద్వారా సాంకేతి సహకారం అందిస్తామని చెప్పారు. ప్రధానగా ప్యాకింగ్, బ్రాండింగ్ విషయంలో మెళుకువలు అవసరమని సూచించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పధకం ద్వారా 35 శాతం సబ్సిడీతో మహిళల చేత యూనిట్లు నెలకొల్పుతామని వివరించారు. జిల్లా కలెక్టర్ సైతం యుక్త వయసు బాలికల్లో రక్తహీనత నివారణకు చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ కమీషన్ సభ్యురాలు గంజీమాల దేవి మాట్లాడుతూ ఆరోగ్యానికి అవసరమైన చిరుధాన్యాల పట్ల ప్రజలకు అవగాహన అవసరమని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుత రోగగ్రస్త సమాజంలో చిరుధాన్యాల ఆహారం అవసరమని సూచించారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ బేతాళ రిబ్కా రాణి మాట్లాడుతూ మహిళలు తమ కాళ్ళపై తాము నిలబటానికి ఉన్న అవకాశాలను అద్వినియోగా పరుచుకోవాలన్నారు. ఆత్మ నూన్యతా భావాన్ని విడనాడి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. మండల పరిషత్ అధ్యక్షులు గంజీమాల రామారావు మాట్లాడుతూ చిరుధాన్యాల ఉత్పత్తుల మార్కెటినకు సహకారం అందిస్తామని చెప్పారు. జెడ్పీటిసి సభ్యురాలు , విద్య ఆహార సలహా స్టాండింగ్ కమిటీ సభ్యురాలు దాసరి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తునట్లే వ్యాపార రంగంలో కూడా విజయం సాధించాలని ఆమె ఆకాక్షించారు. అందుకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని చెప్పారు. జీవనోపాధుల ప్రాజెక్టు డి.పి.ఏం విజయ కుమారి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మట్టా వనజ, ఎంపిడిఓ బేబీ శ్రీలక్ష్మీ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మరడ రాజేష్ , కుంతలగూడెం వైయస్సార్ గ్రామ కమిటీ అధ్యక్షలు కన్నాబత్తుల బాలస్వామి మాట్లాడారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తోట కృపామణి అధ్యక్షతన జీరిగిన ఈ కార్యక్రమంలో సిసిలు శ్రీనివాస్, సాయేంద్రరావు పలువురు సిఏ లు,మండల మహిళా సమాఖ్య కార్యదర్శి గంగాదేవి ,కోశాధికారి కనకరత్నం, శాంతి వెల్ఫేర్ అసోషియేషన్ (కొవ్వూరు) ప్రధాన కార్యదర్శి బేతాళ విజయ్ కుమార్ కనకాద్రిపురం డ్వాక్రా గ్రూపు లీడర్లు రాపోలు రాజేశ్వరి, నలమాటి సత్యభామ,చిన్నం గవరమ్మ, తోట శాంత కుమారి,చాపల కుమారి, దుదుగు నాగమణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img