Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కృష్ణా జలాలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..

హైదరాబాద్‌ : నది జలాల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు అక్షేపనీయంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినా, ఆంధ్రా పాలకులు చేస్తున్న దాదాగిరీ అయినా సరే కృష్ణానదిపై ఏ విధంగా ఏవ్వరు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ నేడు చూస్తున్నారని అన్నారు. కృష్ణా నదిజలాల విషయంలో రానున్న కాలంలో తెలంగాణకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు వున్నాయని, ఈ నేపథ్యంలో జాగత్ర పడాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. అందులో భాగంగానే పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతోందన్నారు. అది పూర్తయితే నాగార్జునసాగర్‌ ఆయకట్టు చాలా సురక్షితమయ్యే అవకాశం ఉంటుందన్నారు. పెద్దదేవులపల్లి, పాలేరు రిజర్వాయర్‌ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం నలగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ నియోజకవర్గం హాలీయాలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన నలగొండ జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. సుమారు రూ.150కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు వచ్చే ఏడాదిన్నరలోగా ఈప్రాంతంలో పెండిరగ్‌లో వున్న అన్ని రకాల ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదే సమయంలో తాము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నేతలు కుళ్లుకుంటున్నారని, రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. దళిత బంధుపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడడం సబబు కాదని రాష్ట్రంలో 70-80 శాతం మంది అర్హులైన దళిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ.10లక్షలు అందిచనున్నట్టు తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు దళిత బంధు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు వివరించారు. సాగర్‌ నియోజకవర్గంలో బంజారా భవన్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంతోపాటు, పోడు భూముల సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే హాలియాలో మిని స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కె.జానారెడ్డి పై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారని, రెండేళ్లలో అందరికి కరెంట్‌ అందించే విధంగా పనులు చేస్తామని, ముఖ్యంగా రైతులకు క్లీన్‌పవర్‌ 24 గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ విషయాన్ని జానారెడ్డి మాట్లాడుతూ మీరు రెండేళ్లకు కాదు కదా పదేళ్లకు కూడా ఆ పని చేయలేరని ఎగతాళి చేశారని, ఒకవేళ రెండేళ్లకు కరెంట్‌ ఇస్తే నేనే గులాబీ కండువా కప్పుకుని టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రచారం చేస్తానని జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24గంటలు విద్యుత్‌ ఇస్తున్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందేనని,మరి మాట తప్పి జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువాతో మొన్న ఎన్నికల్లో పోటీ చేశారని అందుకే ప్రజలు ఆయనకు తగిన బుద్ది చెప్పారని అన్నారు. సాగర్‌ ఉపఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండిరగ్‌లో వున్నాయని వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ ఎమ్మెల్యేలు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హాలియా పట్టణాన్ని చూస్తేనే తమ సమస్య అర్థమవుతుందని ఈ నగరాన్ని అద్భుతంగా చేయాల్సిన అవసరం వుందని ముఖ్యంగా ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వాటన్నింటిని క్రమక్రమంగా పూర్తి చేసుకుందామని కేసీఆర్‌ అన్నారు. నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్‌తో పాటు ఇరిగేషన్‌ భూముల్లో ఉన్నవారిని క్రమబద్దీకరిస్తామని, చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఆ ఇండ్లను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ, హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నామన్నారు. నందికొండ, హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలని అడిగిన నేపథ్యంలో హాలియాకు రూ.15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సాగర్‌ నియోజకవర్గానికి మంజూరు చేసిన డిగ్రీ కాలేజీకి సిబ్బంది, భవనం ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మిని స్టేడియం కూడా మంజూరు చేయడంతో పాటు ఆర్‌ అండ్‌ బీ రోడ్లు, పంచాయతీరాజ్‌ రోడ్లు, కల్వర్టల నిర్మాణానికి రూ.120 కోట్లను మంజూరు చేస్తున్నాను. మొత్తంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నాను అని తెలిపారు. ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న 18 వేల బెడ్స్‌ను ఆక్సిజన్‌ సరఫరా చేసుకునే బెడ్స్‌గా మార్చుకున్నాం. ఏడు కొత్త మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలతో పాటు ప్రతి కాలేజీలో 500 బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో
త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్‌ సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామని, దీన్ని కూడా నెల్లికల్‌ లిఫ్ట్‌తో పాటు మంజూరు చేస్తామన్నారు. దేవరకొండలో ఐదు లిఫ్ట్‌లు మంజూరు చేశామని, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్‌లు, నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్‌తో పాటు ఈ జిల్లాకు మొత్తం 15లిఫ్ట్‌లు మంజూరు చేయడం జరిగిందన్నారు. లిఫ్ట్‌లన్నింటినీ రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు. నల్లగొండలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని అలాగే సాగర్‌లో ఉన్న ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను అప్‌గ్రేడ్‌ చేస్తామని సీఎం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img