Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఘనంగా బొలీవియా 196వ స్వాతంత్య్ర వేడుకలు

లాపాజ్‌ : బొలీవియా 196వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంది. వెనిజులా,కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, బొలీవియాలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సైమన్‌ బొలివర్‌ గౌరవార్థం బొలీవియా నూతన రిపబ్లిక్‌ ఏర్పడిరది. 1825లో స్పానిష్‌ వలసపాలన నుండి బొలీవియా విముక్తిపొందింది. బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్స్‌ ఈ వేడుకలు నాయకత్వం వహించారు. 2019లో అమెరికాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టిన బొలీవియా ప్రజస్వామ్య పునరుద్దరణకు చేపట్టిన కృషిని గురించి ఆర్స్‌ ప్రస్తావించారు. ప్రఖ్యాతిచెందిన మురిల్లో స్క్వేర్‌లో స్వాతంత్య్రసమరంలో మృతిచెందిన అమరవీరులను స్మరిస్తూ పుష్పగుచ్ఛాలు ఉంచారు. దేశంలోని ప్రతి కూడలిలో జాతి జెండాలు రెపరెపలాడాయి. 196 సంవత్సరాల బొలీవియా స్వాతంత్య్ర సమరంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. దేశ అభివృద్ధికి, ఐకమత్యంకోసం పరిపాలనను మరింత దృఢపరుస్తామని దేశ ప్రజలకు ఆర్స్‌ హామీ ఇచ్చారు. ఈ వేడుకలకు హాజరైన దేశ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ చోక్హువాంకా మాట్లాడుతూ సాయుధదళాలు, పోలీసులు, శాసన, కార్యనిర్వాహక సంఘాలు, న్యాయ, ఎన్నికల సంఘాల అధికారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
రష్యాలో బొలీవియా స్వాతంత్య్ర వేడుకలు
రష్యాలో బొలీవియా 196వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంది. రష్యాలోని పూరినేషనల్‌ స్టేట్‌ఆఫ్‌ బొలీవియా రాయబారి మరియా లూయిసా రామోస్‌ దేశ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరిపారు. 2020, 2019లో జరిగిన తిరుగబాటులో బొలీవియా ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారాని పేర్కొన్నారు. దేశ వనరుల దుర్వినియోగం, హింస, ఒంటరితనం, బెదిరింపులతో దేశం ధ్యైర్యాన్ని కోల్పోలేదని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలన్న నిర్ణయాన్ని ఎన్నికల ద్వారా బొలీవియా సాధించిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడంతో దేశాధ్యక్షుడు లూయిస్‌ ఆర్స్‌ దేశ ఆర్థిక, సామాజిక, ఉత్పాదకత రంగాలు వృద్ధిచెందాయని పేర్కొన్నారు.
ఈ వేడుకలలో వెనిజులా, నికరాగ్వా, క్యూబా, రష్యా విదేశాంగమంత్రులు, ఈ దేశాల్లో చదువుకుంటున్న బొలీవియన్‌ విద్యార్థులు, దౌత్యకార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img