Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బడిలో బ్యాలెట్‌ బాక్సులు – చెట్లకింద పాఠాలు


విద్యార్థుల అవస్థలు

కళ్యాణదుర్గం : కరోనా రెండోదశ విజృంభణ తర్వాత సోమవారం నుండి విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఉత్సాహంగా..ఉల్లాసంగా ఇంటి నుంచి పరుగులతో వచ్చిన విద్యార్థులకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేసీజీహెచ్‌ పాఠశాలలో వింత పరిస్థితి ఎదురైంది. పాఠశాల గదుల్లో బ్యాలెట్‌ బాక్సులు భద్రపరచడంతో చెట్ల కింద పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చింది. తొలి రోజే ఈ సంఘటన జరగడంతో విద్యార్థులు అసహనానికి గురయ్యారు. ఏప్రిల్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులు కళ్యాణదుర్గం కేసీజీహెచ్‌ పాఠశాలలో భద్ర పరిచారు. ఐదు మండలాల పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఇక్కడే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అకస్మాత్తుగా కోర్టు తీర్పుతో ఆగిపోయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విద్యార్థుల పాలిటశాపంగా మారింది. కర్ణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 గదులు ఉండగా 35 గదుల్లో బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచారు. మిగిలిన ఐదు గదుల్లో విద్యార్థులకు అందించే పుస్తకాలు, బ్యాగులు భద్రపరిచారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరైనా చెట్ల కిందే పాఠాలు బోధించాల్సి వస్తోంది. పాఠశాలలో 1300 మందికిపైగా విద్యార్థులు ఉండగా తొలిరోజు వందల సంఖ్యలో హాజరయ్యారు. వీరందరినీ చెట్లకింద కూర్చోబెట్టారు. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో…బ్యాలెట్‌ బాక్సులను ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు గందరగోళంలో ఉన్నారు. మరిన్ని రోజులు విద్యార్థులకు చెట్ల కిందే పాఠాలు బోధించాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి చొరవ తీసుకుని బ్యాలెట్‌ బాక్సులను మరో చోటికి తరలించి…విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img