Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చదువు కోసం కొండెక్కి…విద్యార్థి మృతి

న్యూదిల్లీ : ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సదుపాయం లేకపోవ డంతో ఓ విద్యార్థి కొండపైకి ఎక్కాడు. పట్టుతప్పి అక్కడి నుంచి పడి చని పోయాడు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ఆ బాలుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. మృతిచెందిన విద్యార్థిని ఆండ్రియా జగరంగగా పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థి భువనేశ్వర్‌లో చదువుతున్నాడు. కరోనా కారణంగా రాయగడ్‌ జిల్లా పద్మాపూర్‌ బ్లాక్‌లని కందపదురగుడ గ్రామంలో ఉన్నాడు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కోసం ఇక్కడ చాలినన్ని టవర్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసు వివరాలను పద్యాపూర్‌ ఎస్‌ఐ హిరేన్‌ భాతి వెల్లడిరచారు. రాయగడ జిల్లా ప్రధాన కేంద్రానికి ఈ గ్రామం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దర్యాప్తు సమయంలో ఈ గ్రామం నుంచి తనకు సిగ్నల్స్‌ అందలేదు. గ్రామానికి 400 మీటర్లు దూరంలో సిగ్నల్‌ లభించిందని, బాలుడు చనిపోయిన ప్రాంతంలో సిగ్నల్‌ అందినట్లు ఎస్‌ఐ వివరించారు. ఇంటర్నెట్‌ సిగ్నల్‌ కోసం ఆ విద్యార్థి ఓ కొండరాయి చివరికి ఎక్కాడు. అక్కడ ప్రమాదరకర పరిస్థితి కనిపించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విద్యార్థితో మరో నలుగురు ఉన్నారని ఎస్‌ఐ చెప్పారు. చనిపోయిన విద్యార్థి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉందన్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. గాయపడిన విద్యార్థిని పద్మాపూర్‌ అసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. చదువు కోసం తమ పిల్లలు రోజూ కొండపైకి వెళతారని తల్లిదండ్రులు అంగీకరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం రాయగడతో పాటు ఇతర జిల్లాలో ఇంటర్నెట్‌ సదుపాయం కోసం 400 మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఒడిశా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే 256 మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేశామని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ స్వయంగా రాజ్యసభలో చెప్పారు. ఒడిశా ప్రజలకు ఇది సర్వసాధారణమే. ఇంటర్నెట్‌ సదుపాయం కావాలంటే సిగ్నల్స్‌ కోసం ఆ ప్రాంత ప్రజలు, విద్యార్థులు ఒడిశాఆంధ్రప్రదేశ్‌, ఒడిశాజార్ఖండ్‌ సరిహద్దులకు వెళతారు. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కొంతమంది నీటి ట్యాంకులు, కొండలపైకి ఎక్కుతుంటారు. రాష్ట్రంలో కేవలం 40శాతం మందికి మాత్రమే డిజిటల్‌ క్లాసులకు అవకాశం ఉందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సత్యబ్రత సాహు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img