Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వైసిపి నాయకుడి ఆగడాలు ఆపాలి

విశాలాంధ్ర-ముత్తుకూరు : మండలంలోని దువ్వూరు వారి పాలెం కు చెందిన వైసిపి నాయకుడు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు ఎక్కువైనాయని అధికారులు వెంటనే అతని ఆగడాలను ఆపాలని దమ్మాయిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు పడాల నర్సారెడ్డి డిమాండ్ చేశారు. వల్లూరు పంచాయతీ రావిపాడు సమీపంలో జగనన్న సమగ్ర భూ సర్వే కార్యక్రమం కింద సర్వే చేసి వేసిన సర్వే రాయిని తన భూమిలో అక్రమంగా వేయడం జరిగిందంటూ ఆ రాయిని అధికార పార్టీ నాయకుడు పెరికి వేయడం జరిగిందన్నారు. అలాగే రామాపురం వద్ద రోడ్లు భవనాల శాఖకు చెందిన రోడ్డు వేసేటప్పుడు అక్కడ 40 ఎకరాల సాగు భూములకు నిరంధించే తూ మునిర్మించి వేయాల్సి ఉన్న అలా వేయకుండా తూమును పూడ్చి వేయించారని అందువల్ల ఆయకట్టుకు నీరు అందక అక్కడ రైతులు పంటలు వేసుకోవడం లేదన్నారు. పలుమార్లు రైతులు వెళ్లి ఆయన్ని అడిగిన చూద్దాం, చేద్దాం అంటూ కాలయాపన చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాగే చుట్టుగుంట వద్ద స్మశానానికి స్థలం ఏర్పాటు చేసే క్రమంలో రోడ్డు పక్కన సాగునీటి కాలువ ఏర్పాటు చేయాల్సి ఉన్న చేయకపోవడంతో స్మశానం అవతల ఉన్న భూములకు సాగునీరు అందక బీడు భూములుగా మారాయి అన్నారు. ఆ స్మశానానికి స్థలం ఏర్పాటు చేసింది కూడా చంద్రశేఖర్ రెడ్డి అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దమ్మాయిపాలెం హైస్కూల్ కు గతంలో తమ కుటుంబీకులు ఐదు ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూములకు చుట్టూ ప్రహరీ కూడా నిర్మించడం జరిగిందని తెలిపారు. ప్రహరీ గోడ పక్కనే తమకు చెందిన 90 సెంట్లు భూమి ఉందని, దానిని కూడా హైస్కూల్ కు అప్పగించేందుకు చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఈ విషయంపై గతంలో స్థానిక తహసిల్దార్ కు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది అన్నారు. ఇప్పటికైనా దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తన ఆగడా లను ఆపకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. అలాగే మత్స్యకారేతర ప్యాకేజీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి గ్రామంలో ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దువ్వూరు వెంకటేశ్వర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంగిలాల కోటేశ్వరరావు, నెలిపూడి పూడి నరసయ్య, మన్నేపల్లి నారాయణ, నెలి పూడి రామయ్య, చాట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img