Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జగనన్న సురక్ష కార్యక్రమంపై సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం: జగనన్న సురక్ష కార్యక్రమం అమలుకు ముందస్తు ప్రణాళికలతో సిద్దంకావాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరు కార్యాలయంనుండి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమీక్షా సమావేశంలో జగనన్న సురక్ష, గృహనిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఈనెల 23న ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రారంభం చేస్తారని, జిల్లాలో 24నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. అందుకుగాను సచివాలయసిబ్బంది, వాలంటీర్లు ప్రతిఇంటికి వెళ్లి ప్రజలకుగల అవసరాలను ముందుగా తెలుసుకొని, సమస్యలను యాప్ నందు అప్లోడ్ చేయాలన్నారు.మండలటీం వచ్చే సమయానికి సర్టిఫికెట్లుపంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి ముందస్తుగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈప్రక్రియపై సచివాలయ సిబ్బందికి, వాలంటర్లకు ముందస్తుగా అవగాహన కల్పించాలని తెలిపారు.
జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పధకంలోభాగంగా జిల్లాలో పట్టణ ప్రాంతంలో 27వేల 142 ఇళ్లు మంజూరు కాగా అందులో ఇంకా 4100 గ్రౌండింగు కాలేదని, వారంరోజులలో గ్రౌడింగు పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో 7వేల306 మంజూరుగా ఇంకా 1600 ఇళ్లు గ్రౌండింగు చేయాలని, వాటిని గ్రౌండింగు చేసి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టరు ఆదేశించారు.
జిల్లాలో నిర్మాణంలో గల ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు సెప్టెంబరు 15వ తేదీ నాటికి పూర్తిచేయాలన్నారు.
జాయింటు కలెక్టరు ఆర్. గోవిందరావు మాట్లాడుతూ కౌలురైతులకు కౌలుసాగు కార్డులు జిల్లాకు 5125 లక్ష్యం నిర్ణయించారని, లక్ష్యానికి మించి కౌలురైతులకు కార్డులు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఈనెల 25నాటికి సచివాలయం పరిధిలోగల గ్రామాలలో కనీసంఒకటి చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగేటట్లు చూడాలన్నారు.డిసిసిబి బ్యాంకు లావాదేవీల రిజస్ట్రేషన్లుకూడా గ్రామాలలో చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజీ, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకరరావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజకుమార్ , జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img