London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

వక్రీకరించి మాట్లాడొద్దు

ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా
విశాలాంధ్ర-ముత్తుకూరు : ప్రజా సమస్యలపై మాట్లాడితే వాటిని వక్రీకరించి మాట్లాడిన దువ్వూరుచంద్రశేఖర్ రెడ్డి శివాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ డ మాయపాలెం టిడిపి నాయకుడు పడాల నర్సారెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం డ మ్మాయిపాలెం లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఉన్నత పాఠశాలకుఐదు ఎకరాల భూమిని ఇచ్చింది వాస్తవమేనని అయితే దానికి కాంపౌండ్ కూడా నిర్మించడం జరిగిందన్నారు. దానికి పక్కనే ఉన్న 90 సెంట్లు భూమిని కూడా ప్రస్తుతం అధికారం మాదే అంటూ తాము ఏది చేస్తే అది చెల్లుతుంది అని అహంకారంతో మంత్రిని అడ్డుపెట్టుకుని అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుని తమకు చెందిన 90 సెంట్లు భూములను కూడా స్వాధీన పరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణ వ్యక్తం చేశారు. దేవాలయ భూములను మూడు ఎకరాలు తన భార్య పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నానని దువ్వూరు శివాలయం వద్ద దేవుడు మీద ప్రమాణం చేయాలని, తాను కూడా భూములను తీసుకోలేదని ప్రమాణం చేస్తానని తెలిపారు. మూడు ఎకరాల భూములను తీసుకున్నట్టు నిరూపిస్తే తాను మూడు ఎకరాలను దువ్వూరు కిస్తానని, మూడు ఎకరాలు తనకు ఇవ్వాలని సవాల్ విసిరారు.అలాగే సాగు భూములకు నీరు అందించాలని అందువల్ల రోడ్డున తవ్వి తూములు వేయాలని రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులను తాము కోరడం జరిగిందని , మిమ్మల్ని అడిగినట్టు ప్రచారం చేయడం విచారకరమన్నారు. స్మశానంకు స్థలం ఏర్పాటు చేసిన సమయంలో పక్కనే ఉన్న ఎండోమెంట్ భూములకు సాగునీరు అందించేందుకు కాలువ ఏర్పాటు చేయాల్సిన చేయకపోవడం మీ తప్పేనని అందువల్ల ఎండోమెంట్ భూములు బీడుగా మారుతాయి అని ఆయన తెలిపారు. కాలువ ఏర్పాటు చేయాలని తాసిల్దారును కూడా అడగడం జరిగిందన్నారు.32 సెంట్లు తమ స్వాధీనంలో ఉన్నట్లు చెబుతున్న చంద్రశేఖర్ రెడ్డి 3 ఎకరాల ప్రభుత్వ భూములు జామాయిల్ సాగు చేయడం ఏంటని ప్రశ్నించారు. జగనన్న సమగ్ర భూ సర్వే కింద రాళ్లు వేస్తే ఆ రాళ్లు పెరిగింది ఎవరు దూరంగా పడవేసింది ఎవరు చూసినవారు ఉన్నారని, తాను రాయి పెరిగేసినట్టు చెబుతున్న చంద్రశేఖర్ రెడ్డి వల్లూరులోని శివాలయం వద్ద ప్రమాణం చేస్తావా అంటూ సవాల్ విసిరారు. స్థానిక దళిత నాయకుడు ఇంగిరాల కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయమైన పనులను చేయడం జరిగిందన్నారు. అయితే ఇంటిని వేసే స్థలాల కోసం 500 రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, నాడు 15 ఎకరాలను డ మ్మాయిపాలెం పంచాయతీలు కలిపేందుకు కృషి చేసిన తామేనని ఆయన గుర్తు చేశారు. నాడు పది లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయలేదని చెబుతున్న నాయకులు ఎన్నికలు రావడంతో ఆ పనులు చేయగల లేకపోయాము అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆలయ పూజారి మాట్లాడుతూ దేవస్థానం గురించి మాట్లాడడం ఎవరికైనా మంచిది కాదని, రామ మందిరంలో తాము చేసే పూజలకు ఇతర కార్యక్రమాలకు తమ జీతాలు కూడా పడాల నర్సారెడ్డి నేటికీ ఇస్తున్నాడని ఆయన తెలిపారు. శివాలయం పెత్తనం దూరు చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన అక్కడ ఏమి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తున్నామా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు మాని యదార్థ పరిస్థితిని మాట్లాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img